- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది సజీవదహనం
గోవాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం అర్థరాత్రి బిర్చ్ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలడంతో ఉవ్వెత్తున మంటలు ఎగసి పడ్డాయి.

దిశ, వెబ్‌డెస్క్: గోవాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం అర్థరాత్రి బిర్చ్ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలడంతో ఉవ్వెత్తున మంటలు ఎగసి పడ్డాయి. అర్పోరాలోని రోమియోలేన్ లో జరిగిన ఈ ప్రమాదంలో 23 మంది సజీవదహనమైనట్లు తెలుస్తోంది. మృతి చెందినవారంతా క్లబ్ లో పనిచేసే ఉద్యోగులుగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిిత్స అందిస్తున్నారు.
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఎమ్మెల్యే మైఖేల్ లోబో ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై అధికారులు, పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నైట్ క్లబ్ లో నిబంధనలు పాటించలేదని సీఎం ప్రమోద్ వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించినవారిలో 3-4 పర్యాటకులు ఉన్నట్లు సీఎం తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More..






