Viral video: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. శ్రీలంకలో దెబ్బతిన్న రవాణా వ్యవస్థ.. వీడియో వైరల్

by Ramesh Naini |

దిత్వా తుఫాన్ విరుచుకుపడ్డ నేపథ్యంలో శ్రీలంకలో రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది.

Viral video: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. శ్రీలంకలో దెబ్బతిన్న రవాణా వ్యవస్థ.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దిత్వా తుఫాన్ విరుచుకుపడ్డ నేపథ్యంలో శ్రీలంకలో రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ప్రళయాన్ని తలపించే భారీ వర్షాలు, ఉద్ధృత జల ప్రవాహాలు దేశవ్యాప్తంగా తీవ్ర నష్టం మిగిల్చాయి. విపత్తు నిర్వహణ కేంద్రం (DMC) ప్రకారం ఇప్పటివరకు 123 మంది మృతి, పలువురు గల్లంతైనట్లు వెల్లడించింది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు డెవలప్‌మెంట్ అథారిటీ (RDA) తాజా వివరాల ప్రకారం..

దేశవ్యాప్తంగా 206 రహదారులు పూర్తిగా అడ్డంకులకు గురయ్యాయి, 10 వంతెనలు దెబ్బతిన్నాయి, అనురాధపురం, నువారా ఎలియాలకు రోడ్డు మార్గంలో చేరడం అసాధ్యం, దక్షిణ ఎక్స్‌ప్రెస్‌వేలో ఇంటర్‌చేంజ్ మూసివేశారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ రక్షణ చర్యలను వేగవంతం చేస్తున్నారు. ప్రజలకు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. 43 వేల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిన చూపుతున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ వీడియో ఇదే..

Next Story