- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిత్వా తుఫాను బీభత్సం..159 కి చేరిన మృతులు సంఖ్య
దిత్వా తుపాను (Dithwa Cyclone) ప్రభావం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించేలా చేసింది. క్లౌడ్ బరస్ట్ తరహాలో కురిసిన వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి.

దిశ, వెబ్ డెస్క్: దిత్వా తుపాను (Dithwa Cyclone) ప్రభావం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించేలా చేసింది. క్లౌడ్ బరస్ట్ తరహాలో కురిసిన వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదలు అనేక ప్రాంతాల్లో తీవ్ర బీభత్సం సృష్టించాయి. ఈ విపత్తు కారణంగా నిన్న సాయంత్రానికి 129 మంది ప్రాణాలు కోల్పోగా.. ఈ రోజు ఉదయం 11 గంటలకు మృతుల సంఖ్య 159కి చేరింది. అలాగే వరదల కారణంగా సుమారు 200 మందికి పైగా గల్లంతైనట్లు (మిస్సింగ్) సమాచారం. వరదల ధాటికి 20 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయని శ్రీలంక అధికారులు ప్రకటించారు. ఫలితంగా లక్షలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా, శ్రీలంక ప్రభుత్వం జాతీయ విపత్తును ప్రకటించింది.
ఈ క్లిష్ట సమయంలో భారత్ తన పొరుగు దేశానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఆపదలో ఉన్న శ్రీలంకకు సహాయం చేయడంలో భారత్ వెనుకాడకుండా కలిసి పనిచేస్తుంది. ఇప్పటికే మన NDRF బృందాలు శ్రీలంక చేరుకుని, సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడంలో, సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో భారతీయ ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, నీరు, వైద్య సహాయం అందించడానికి స్థానిక అధికారులు, అంతర్జాతీయ సంస్థలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.






