సైబర్ నేరాలు.. కంబోడియాలో 105 మంది భారతీయులు అరెస్టు

by Yella Dhawani Reddy |

కంబోడియాలో (Cambodia) 105 మంది భారతీయులు అరెస్టు అయ్యారు.

సైబర్ నేరాలు.. కంబోడియాలో 105 మంది భారతీయులు అరెస్టు
X

దిశ, వెబ్ డెస్క్: కంబోడియాలో (Combodia) 105 మంది భారతీయులు అరెస్టు అయ్యారు. వీరంతా సైబర్ నేరాల్లో (Cyber crime) అరెస్ట్ కావటం సంచలనం సృష్టిస్తోంది. కంబోడియాలో సైబర్ నేరాలపై 15 రోజులపాటు 138 చోట్ల జరిగిన దాడుల్లో 3,075 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారికి తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం కంబోడియా అధికారులతో చర్చలు జరుపుతోంది. అలాగే, సైబర్‌ నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

భారత్‌తో సహా వివిధ దేశాలకు చెందిన వ్యక్తులు కంబోడియాలో ఉంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అరెస్టయిన వారిలో అత్యధికంగా చైనా పౌరులు 1,028 మంది ఉండగా, 693 వియత్నామీస్, 366 ఇండోనేషియన్లు, 105 భారతీయులు, 101 బంగ్లాదేశీలు, 82 థాయ్‌లు, 57 కొరియన్లు, 81 పాకిస్తానీలు, 13 నేపాళీలు, 4 మలేషియన్లు సహా ఫిలిప్పీన్స్, లావోస్, కామెరూన్, నైజీరియా, ఉగాండా, సియెర్రా లియోన్, మంగోలియా, రష్యా, మయన్మార్ పౌరులు కూడా ఉన్నారు. ఇక ఈ 3027 మందిలో 606 మంది మహిళలు ఉండటం గమనార్హం. ఈ దాడుల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, డ్రగ్స్, భారత, చైనా పోలీసు నకిలీ యూనిఫామ్‌లు, డ్రగ్ తయారీ సామగ్రి, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఎక్స్టాసీ పౌడర్, ఇతర నార్కోటిక్స్ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story