Cybercrime: సైబర్ క్రైమ్ ముప్పు.. ఏడాదిలోనే రూ.20వేల కోట్లు నష్టం !

by B.Srinivas |

డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సైబర్ క్రైమ్ మోసాల ముప్పు తీవ్రంగా పొంచి ఉంది. దీని కారణంగా కంపెనీలు రూ.20 వేల కోట్లు నష్టపోయే అవకాశం ఉంది.

Cybercrime: సైబర్ క్రైమ్ ముప్పు.. ఏడాదిలోనే రూ.20వేల కోట్లు నష్టం !
X

దిశ, నేషనల్ బ్యూరో: డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సైబర్ క్రైమ్ (Cybercrime) మోసాల ముప్పు తీవ్రంగా పొంచి ఉంది. దీని కారణంగా భారతీయ కంపెనీలు ఈ ఏడాది రూ.20 వేల కోట్లు నష్టపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బెంగళూరుకు చెందిన సైబర్ సెక్యురిటీ కంపెనీ క్లౌడ్ సెక్ (Cloudseck) నివేదికలో అంచనా వేసింది. కేవలం కంపెనీల పేర్లను దుర్వినియోగం చేయడం ద్వారా మాత్రమే దాదాపు రూ.9,000 కోట్ల మోసం జరగొచ్చని పేర్కొంది. 5000 కంటే ఎక్కువ ప్రమాదకరమైన వెబ్‌సైట్ డొమైన్‌లు, 16000 బాండ్ల వివరాలు, ఇతర డీటెయిల్స్‌ను విశ్లేషించిన అనంతరం ఈ నివేదికను వెల్లడించినట్టు క్లౌడ్ సెక్ తెలిపింది.

ఈ డేటా ప్రకారం.. సైబర్ నేరాల ఫిర్యాదులు ఈ ఏడాది 25 లక్షలు దాటే అవకాశం ఉంది. బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగం దాదాపు రూ.8,200 కోట్ల అత్యధిక ప్రభావాన్ని కలిగి ఉంటుందని, ఇది మొత్తం నష్టాల్లో 41 శాతం ఉంటుందని క్లైడ్ సెక్ అంచనా వేసింది. అలాగే రిటైల్, ఈ-కామర్స్ రంగం రూ.5,800 కోట్ల నష్టాన్ని చవిచూసే చాన్స్ ఉందని తెలిపింది. మోసపూరిత వెబ్‌సైట్ డొమైన్‌లు 2025లో 65 శాతం పెరుగుతాయని పేర్కొంది. అంతేగాక నకిలీ యాప్‌లు 83 శాతం పెరిగే అవకాశం ఉంది. దీని వలన సైబర్ మోసాలు గతంలో కంటే మోసపూరితంగా మారే ప్రమాదం ఉంది.

Next Story