- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా మెడికల్ దిగ్గజం ‘స్ట్రైకర్’పై సైబర్ దాడి: ఇరాన్ హ్యాకర్ల సంచలన ప్రకటన
అమెరికా మెడికల్ పరికరాల దిగ్గజం ‘స్ట్రైకర్’ నెట్‌వర్క్‌పై ఇరాన్ హ్యాకర్లు సైబర్ దాడికి పాల్పడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: అగ్రదేశం అమెరికాకు చెందిన ప్రముఖ మెడికల్ పరికరాల తయారీ సంస్థ స్ట్రైకర్ (Stryker) నెట్‌వర్క్‌పై భారీ సైబర్ దాడి జరిగింది. ఈ దాడి కారణంగా కంపెనీకి చెందిన గ్లోబల్ నెట్‌వర్క్ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ విధ్వంసకర దాడికి తామే బాధ్యులమని ఇరాన్ అనుబంధ హ్యాకింగ్ గ్రూప్ ఒకటి ప్రకటించింది. ఇందులో భాగంగా స్ట్రైకర్ సంస్థకు చెందిన సుమారు 50 టెరాబైట్ల (TB) అత్యంత కీలకమైన డేటాను తాము దొంగిలించినట్లు హ్యాకర్లు తమ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా వెల్లడించారు. ఇది సైబర్ యుద్ధంలో ఒక కొత్త అధ్యాయమని వారు పేర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్ ఎన్విరాన్‌మెంట్‌పై జరిగిన ఈ దాడి వల్ల తమ అంతర్గత వ్యవస్థలకు అంతరాయం ఏర్పడిందని స్ట్రైకర్ ధృవీకరించింది. అయితే, ఇప్పటివరకు ఎటువంటి మాల్వేర్ లేదా రైన్సమ్‌వేర్ (Ransomware) ఆనవాళ్లు దొరకలేదని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ తెలిపింది. తాజా సైబర్ ఎటాక్‌తో తమ ఉత్పత్తులైన మాకో (Mako), వోసెరా (Vocera) వంటి మెడికల్ పరికరాల పనితీరుపై ఎలాంటి ప్రభావం లేదని, అవి వాడటానికి సురక్షితమని కంపెనీ స్పష్టం చేసింది. ఆర్డర్ల డెలివరీలో మాత్రం కొంత ఆలస్యం అవుతుందని పేర్కొంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా 61 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ సుమారు 56 వేల మంది ఉద్యోగులను కలిగిన ‘స్ట్రైకర్స్’పై జరిగిన ఈ దాడి వైద్య రంగంలో ఆందోళన కలిగిస్తోంది.






