- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cyber attack: యూరప్ విమానాశ్రయాలపై సైబర్ అటాక్.. పలు విమానాల రద్దు
లండన్‌లోని హీత్రూ ఎయిర్ పోర్ట్, జర్మనీలోని బెర్లిన్ విమానాశ్రయం, బెల్జియంలోని బ్రస్సెల్స్ ఎయిర్ పోర్ట్‌లపై సైబర్ దాడి జరిగింది.

దిశ, నేషనల్ బ్యూరో: యూరప్‌లోని అనేక విమానాశ్రయాలు శనివారం సైబర్ దాడికి గురయ్యాయి. లండన్‌లోని హీత్రూ ఎయిర్ పోర్ట్, జర్మనీలోని బెర్లిన్ విమానాశ్రయం, బెల్జియంలోని బ్రస్సెల్స్ ఎయిర్ పోర్ట్‌లపై సైబర్ దాడి జరిగింది. సైబర్ దాడి కారణంగా చెక్-ఇన్, బోర్డింగ్ సేవలకు అంతరాయం తీవ్ర కలిగింది. దీంతో అనేక విమానాలు ఆలస్యం కాగా, మరి కొన్నింటిని రద్దు చేశారు. అనేక విమానాశ్రయాలలో మాన్యువల్ విధానాలను ఉపయోగించి కార్యకలాపాలు నిర్వహించారు. చెక్ ఇన్, బోర్డింగ్‌లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ‘తమ చెక్ ఇన్, బోర్డింగ్ వ్యవస్థల సర్వీస్ ప్రొవైడర్‌పై సైబర్ దాడి జరిగింది. దీని వల్ల సాంకేతిక అంతరాయాలు ఏర్పడ్డాయి. విమాన షెడ్యూల్‌లలో ఆలస్యం జరిగింది’ అని బ్రస్సెల్స్ విమానాశ్రయం తెలిపింది.
జర్మనీలోని బ్రాండెన్‌బర్గ్ ఎయిర్ పోర్ట్ కూడా దాని సర్వీస్ ప్రొవైడర్ వ్యవస్థపై సైబర్ దాడి జరిగినట్టు ధ్రువీకరించింది. దాడుల అనంతరం భద్రత దృష్యా, విమానాశ్రయ పరిపాలన తాత్కాలికంగా నెట్‌వర్క్ కనెక్షన్‌ను నిలిపివేసింది. హీత్రూ ఎయిర్ పోర్ట్ కూడా సాంకేతిక సమస్య తలెత్తినట్టు తెలిపింది. విమానయాన సంస్థలకు చెక్-ఇన్, బోర్డింగ్ సర్వీసులపై ప్రభావం చూపినట్టు పేర్కొంది. సైబర్ అటాక్ అనంతరం అన్ని విమానాశ్రయాలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ చేశాయి. ప్రయాణికులు తమ విమాన షెడ్యూల్‌ను తనిఖీ చేసుకోవాలని, ఫ్లైట్ టైం ఆధారంగా వారి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించాయి.






