CWC: రేపు సీడబ్లూసీ సమావేశం.. కీలక అంశాలపై చర్చించే చాన్స్

by B.Srinivas |

సీడబ్లూసీ సమావేశం శుక్రవారం జరగనుంది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు మీటింగ్ నిర్వహించనున్నారు.

CWC: రేపు సీడబ్లూసీ సమావేశం.. కీలక అంశాలపై చర్చించే చాన్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం శుక్రవారం జరగనుంది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ భేటీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కుల గణన (Cast census) అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై భవిష్యత్ కార్యాచరణపై డిస్కస్ చేయనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun karge), అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi) సహా పలువురు సీనియర్ నాయకులు హాజరు కానున్నారు.

కుల గణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక చర్యను కాంగ్రెస్ స్వాగతించింది. అయితే కుల గణన చేపట్టడానికి ప్రభుత్వం కాలపరిమితి నిర్ణయించాలని, లేదంటే ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణీత సమయం కేటాయించాలని కోరుతున్నారు. సీడబ్లూసీ భేటీలో దీనిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అంతేగాక రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని కూడా తొలగించాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. దీనిపైనా సీడబ్లూసీలో డిస్కస్ చేయనుంది.

Next Story