దారుణం.. కోడలిపై మామ అత్యాచారం.. అత్త సాయంతో ఇంటి బయట పాతిపెట్టి..!

by Yella Dhawani Reddy |

హర్యానా రాష్ట్రం ఫరిదాబాద్‌లో 24ఏళ్ల యువతిపై జరిగిన హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దారుణం.. కోడలిపై మామ అత్యాచారం.. అత్త సాయంతో ఇంటి బయట పాతిపెట్టి..!
X

దిశ, వెబ్ డెస్క్: హర్యానా రాష్ట్రం (Haryana) ఫరిదాబాద్‌లో 24ఏళ్ల మహిళ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముందస్తు పథకం ప్రకారం కోడలిపై మామ అత్యాచారం చేసి, అనంతరం ఆమెను హత్య చేసి ఇంటి బయట పాతిపెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. బాధితురాలు కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. దర్యాప్తులో కోడలిపై అత్యాచారం చేశానని మామ అంగీకరించడంతో పాటు, హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. అంతేకాకుండా, ఈ ఘాతుకానికి మామకు అత్త సహకరించినట్లు తెలిసి ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. 'నిందితుడు మొదట బాధితురాలికి చెరకు రసం తాగించి మత్తులోకి దించాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత ఆమెపై లైంగిక దాడి చేశాడు. అనంతరం దుపట్టాతో గొంతు నులిమి చంపేశాడు. ఈ దారుణం ఒడిగట్టిన తర్వాత ఆమెను ఇంటి బయట 10 అడుగుల లోతైన గొయ్యిలో పాతిపెట్టాడ' అని తెలిపారు.

Next Story