దారుణం.. ఫోన్ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని చంపి.. సముద్రంలో పడేశాడు!

by Yella Dhawani Reddy |

కంటికి రెప్పాలా కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. కేవలం ఫోన్ చూస్తోందనే కారణంతో అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిని కిరాతకంగా చంపేశాడు.

దారుణం.. ఫోన్ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని చంపి.. సముద్రంలో పడేశాడు!
X

దిశ, వెబ్ డెస్క్: కంటికి రెప్పాలా కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. కేవలం ఫోన్ చూస్తోందనే కారణంతో అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిని కిరాతకంగా చంపేశాడు. మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైలో (Mumbai) ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్లితే..నాజియా అనే మహిళ తన రెండో భర్త ఇమ్రాన్‌షేక్‌తో కలిసి ముంబైలో నివసిస్తోంది. వీరితో పాటే నాజియా మొదటి భర్త కూతురు అమైర కూడా ఉంటుంది. ఈ క్రమంలో చిన్నారి తెల్లవారుజామున 3 గంటల వరకు నిద్రపోకుండా ఫోన్‌లో గేమ్స్ ఆడుతోందని ఇమ్రాన్.. అమైర గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు.

అయితే, చిన్నారి కనిపించకపోవటంతో నాజియా భర్త ఇమ్రాన్‌షేక్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసుకుంది. కిడ్నాప్‌ కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తు చేస్తున్న సమయంలో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా.. బాలిక తన సవతి తండ్రితో కలిసి ఉన్నట్లు గుర్తించారు. చిన్నారి కిడ్నాప్‌ కేసులో అతడి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ సమయంలో ముంబై ససున్‌ డాక్‌లోని అరేబియా సముద్రంలో చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం చిన్నారి తల్లిదండ్రులను సంప్రదించడానికి ప్రయత్నించగా.. ఆమె సవతి తండ్రి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండటమే కాక, పరారీ అయినట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చిన్నారిని చంపేసినట్లు అంగీకరించనట్లు పోలీసులు తెలిపారు.

Next Story