- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్థాన్ మహిళతో వివాహాన్ని దాచిపెట్టిన జవాన్.. సీఆర్‌పీఎఫ్ చర్యలు
పాకిస్థానీ యువతితో వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టిన జవాన్ పై సీఆర్పీఎఫ్ (CRPF) చర్యలు తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థానీ యువతితో వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టిన జవాన్ పై సీఆర్పీఎఫ్ (CRPF) చర్యలు తీసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) ఘటన తర్వాత భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్ తో సంబంధాలను పూర్తిగా తెంచుకుంటూ పలు ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటనలు చేసింది. ఇందులో భాగంగానే ఇండియాలో ఉన్న పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లిపోవాలని, పాక్ లో ఉన్న భారతీయులు తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లోని పాకిస్థానీలను ఇండియా నుంచి పంపేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ సీఆర్పీఎఫ్ జవాన్ (CRPF Jawan) చేసిన పనికి అతడిపై వేటు పడింది. 41వ బెటాలియన్ (41 bettalian) కు చెందిన మునీర్ అహ్మద్ (Muneer Ahmed) అనే సీఆర్పీఎఫ్ అధికారి పాకిస్థాన్ జాతీయురాలిని (Pakisthani Women) వివాహం (Marriage) చేసుకున్నాడు. తన వివాహ విషయాన్ని దాచిపెడట్టడంతో పాటు ఆమె వీసా గడువు ముగిసినా తన భార్యకు ఆశ్రయం కల్పించాడు. దీంతో మునీర్ అహ్మద్ పై చర్యలు తీసుకుంటూ సీఆర్పీఎఫ్ ప్రకటన విడుదల చేసింది. సీఆర్పీఎఫ్ అధికారి మునీర్ అహ్మద్ ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.






