- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఆర్‌పీఎఫ్ జవాన్‌ను కాల్చి చంపిన దుండగులు
by Phanindra |
సీఆర్‌పీఎఫ్ జవాన్‌ను కాల్చి చంపిన దుండగులు. కన్వర్ యాత్రలో గొడవ పడి ఇంటికొచ్చిన తర్వాత హత్య.

X
దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలోని సోనిపట్‌కు చెందిన కృషన్ కుమార్ అనే సీఆర్‌పీఎఫ్ జవాన్‌ను కొందరు దుండగులు కాల్చిచంపారు. కొన్నిరోజుల క్రితం కన్వర్ యాత్ర సమయంలో కొందరితో కృషన్ గొడవ పడ్డారు. ఈ యాత్రకు కృషన్ వెళ్లడానికి ముందే ఆయన్ను చంపడానికి పతకం వేసినట్లు సమాచారం. యాత్రలో గొడవ తర్వాత ఇంటికి తిరిగొచ్చిన ఆయనపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ హత్యలో అజయ్, నిషాంత్ అనే ఇద్దర్ని ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన సాగర్, ప్రవీణ్, మోహిత్ అనే ముగ్గుర్ని ఇప్పటికే అరెస్టు చేశారు. అజయ్, నిషాంత్ పరారీలో ఉన్నారని తెలియజేశారు. వీరు మరో గ్రామస్థుడిని కూడా హత్య చేసేందుకు పథకం వేసినట్లు పోలీసులు గుర్తించారు.
Next Story






