- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Crpf jawan: భార్యను చంపి.. తానూ తుపాకీతో కాల్చుకున్న సీఆర్పీఎఫ్ జవాన్.. భోపాల్‌లో ఘటన
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్ తన భార్యను గన్‌తో కాల్చి చంపి.. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దిశ, నేషనల్ బ్యూరో: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్ తన భార్యను గన్‌తో కాల్చి చంపి.. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ (Madhuyapradesh)లోని భోపాల్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని బింద్ (Bindh) జిల్లాకు చెందిన రవికాంత్ వర్మ (35) అనే జవాన్ బంగ్రాసియా ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ భేస్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్నారు. క్యాంపునకు సమీపంలోని క్యాపిటల్ గ్రీన్ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో తన భార్య రేణు (32)ని సర్వీస్ రివాల్వర్‌తో కాల్చిచంపాడు. సీఆర్పీఎఫ్ కంట్రోల్ రూమ్, తన ఇంటి యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పారు. అనంతరం అదే తుపాకీతో తనకు తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగానే రవికాంత్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిపారు. కాగా, రవికాంత్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరూ ఇంట్లో నిద్రిస్తుండగానే ఈ ఘటనకు పాల్పడటం గమనార్హం.






