బస్తర్‌లో పది వేల రేడియోలు పంచిపెట్టిన సీఆర్పీఎఫ్!

by Phanindra |

బస్తర్‌లో పది వేల రేడియోలు పంచిపెట్టిన సీఆర్పీఎఫ్ దళాలు. మావోయిస్టు భావజాలం ప్రభావం తగ్గించడమే లక్ష్యం.

బస్తర్‌లో పది వేల రేడియోలు పంచిపెట్టిన సీఆర్పీఎఫ్!
X

దిశ, నేషనల్ బ్యూరో: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వారి ప్రాభవాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే వారికి కంచుకోట వంటి బస్తర్‌లో పది వేలకుపైగా రేడియోలను పంచిపెట్టింది. ఇక్కడి ప్రజల్లో మావోయిస్టు భావజాలాన్ని తొలగించి, జాతీయ భావనలను పెంచేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం సీఆర్పీఎఫ్ దళాలు ఈ రేడియోలను పంచిపెట్టారు.

ఇప్పటికే బస్తర్ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా సీఆర్పీఎఫ్ దళాలు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పంచిపెట్టిన రేడియోల్లో నెలనెలా ప్రధాని మోడీ మాట్లాడే ‘మన్ కీ బాత్’, ప్రభుత్వ పథకాలు, వినోద కార్యక్రమాలు వినేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతంలోని 180 సీఆర్పీఎఫ్ కంపెనీ బలగాలు.. ఒక్కో కంపెనీ 60 రేడియోలను మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు అందజేశారు. ఇలా చేయడం ద్వారా కనీసం 54 వేల మంది ప్రజలు జనజీవనంతో కలుస్తారని అధికారులు భావిస్తున్నారు.

Next Story