- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mahakumbh Mela:టవల్‌తో మహాకుంభమేళాలో ఓ యువతి స్నానం.. నెట్టింట విమర్శలు!
ఉత్తరప్రదేశ్(Uttarapradesh)లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా కోలాహలంగా కొనసాగుతుంది.

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్(Uttarapradesh)లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా కోలాహలంగా కొనసాగుతుంది. ఈ మహాకుంభమేళా(Mahakumbh Mela)కు ఎక్కడెక్కడి నుంచో అధిక సంఖ్యలో భక్తులు(Devotees) తరలి వస్తున్నారు. ఈ తరుణంలో త్రివేణి సంగమంలో తలస్నానం చేసి పాపాలు పోగొట్టుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులు, మహిళలు, సాధువులు, సన్యాసులు వస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేక ఏర్పాట్లు చేసింది.
ఇందులో భక్తులు బస చేసేందుకు సౌకర్యాలు కల్పించింది. ఇవే కాకుండా పోర్టబుల్ టాయిలెట్లను తయారు చేశారు. తాగునీటి కోసం కుళాయిలు ఏర్పాటు చేశారు. కానీ కొంతమంది మాత్రం తమ అలవాటును వదులుకోవడం లేదు. అయితే మహాకుంభమేళలో త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో స్నానాలు చేస్తున్నారు. తడిబట్టలతో స్నానం చేసి తమ పాపాలు కడిగేసుకుంటున్నారు. కొందరు మాత్రం వింత చేష్టలతో ప్రవర్తిస్తూ భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అయితే రీల్స్ చేసుకునేందుకు ఇక్కడికి వచ్చి విమర్శల పాలవుతున్నారు.
అసలు విషయం ఏమిటంటే.. మహాకుంభమేళలో పుణ్యస్నానం ఆచరించేందుకు వచ్చిన ఓ యువతి రీల్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట విమర్శలకు దారి తీస్తోంది. గోవా(Gova) లేక మాల్దీవుల మాదిరి బీచ్‌లో ఎంజాయ్ చేసేందుకు వచ్చినట్లుగా ఓ యువతి టవల్ కట్టుకుని షూట్ వద్దకు చేరుకుంది. అర్ధనగ్నంగా ఉన్న తనను వీడియో(Video) తీయించుకుని సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేసింది. అయితే పవిత్రమైన మహాకుంభమేళలో అలా చేసినందుకు యువతి పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో పై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.






