అద్భుత కట్టడానికి రూ. 40 లక్షలు మాత్రమే! హ్యాట్సాఫ్! ప్రారంభించిన ఒక్క రోజులోనే అది పనిచేయట్లే?

by Ramesh Naini |   (  Updated:2025-04-07 08:42:09  IST  )

బీహార్‌లో కొత్తగా నిర్మించిన ఓ క్లాక్ టవర్ ప్రారంభించిన ఒక రోజులోనే పనిచేయడం మానేసిందని సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

అద్భుత కట్టడానికి రూ. 40 లక్షలు మాత్రమే! హ్యాట్సాఫ్! ప్రారంభించిన ఒక్క రోజులోనే అది పనిచేయట్లే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీహార్‌లో కొత్తగా నిర్మించిన ఓ క్లాక్ టవర్ (clock tower in Bihar Sharif) ప్రారంభించిన ఒక రోజులోనే పనిచేయడం మానేసిందని సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. బీహార్ షరీఫ్‌లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ. 40 లక్షల వ్యయంతో ఓ కాంక్రిట్ క్లాక్ టవర్‌ను నిర్మించారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా ఓ వ్యక్తి ఫోటోలను పోస్ట్ చేశారు. ‘పేలవంగా పెయింట్ వేసిన ఈ కాంక్రీట్ క్లాక్ టవర్ ('Smart City' project) స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద నిర్మించారు. ప్రారంభించిన 24 గంటల్లోనే దాని గడియారం పనిచేయడం లేదని ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్మాణానికి ఖర్చు ఎంతో ఊహించారా? ఈ అద్భుత నిర్మాణానికి కేవలం 40 లక్షలు.. హ్యాట్సాఫ్!’ అని ఓ ఎక్స్ యూజర్ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో ప్రభుత్వంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

బీహార్‌లో అధికారుల అవినీతికి ఈ క్లాక్ టవర్ నిదర్శనమని నెటిజన్లు ఆరోపణలు చేస్తున్నారు. బ్రిటీష్ కాలంలో కట్టిన క్లాక్ టవర్‌ను ఈ క్లాక్ టవర్‌ను పోలుస్తూ ఫోటోలు పెడుతున్నారు. ఇక, నెట్టింట వైరల్ అవ్వడంతో అధికారులు తాజాగా స్పందించారు. ‘దయచేసి అలాంటి పుకార్లను నమ్మవద్దు. ఈ క్లాక్ టవర్ డిజైన్, నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు’ అని బీహార్ షరీఫ్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది. కొత్తగా నిర్మించిన క్లాక్ టవర్‌లో కేబుల్లను కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారని, దానిని తిరిగి ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం ఉందని, ఈ క్లాక్ టవర్ పూర్తి నిర్మాణం తర్వాతే ప్రారంభోత్సవం జరుగుతుందని బీహార్ షరీఫ్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ మరొక పోస్ట్‌లో పేర్కొంది.

Next Story