Crimilayer: ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లలో క్రిమీలేయర్ అమలుపై సీజేఐ మరోసారి కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-11-23 11:51:17  IST  )

పదవి విరమణ తర్వాత ప్రభుత్వ పదవిపై జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందించారు.

Crimilayer: ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లలో క్రిమీలేయర్ అమలుపై సీజేఐ మరోసారి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమీలేయర్ (Crimilayer for SC STs) అమలు చేయాలని సీజేఐ జస్టిస్ బి.ఆర్ గవాయ్ (CJI Justice BR Gavai) మరోసారి అన్నారు. కుల ఆధారిత రిజర్వేషన్లలో క్రీమీలేయర్ సమస్యను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు తన వంతు కృషి చేసిందని తదుపరి చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం, పార్లమెంటుపై ఉందని అన్నారు. రేపు సీజేఐగా పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్ గవాయ్ ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమానత్వం ప్రజల్లోకి వెళ్లాలని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కొంత మంది ఐఏఎస్ అధికారుల పిల్లులు ఇంకా రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెబితే నాపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఓ సమస్యగా మారిందన్న జస్టిస్ గవాయ్.. నాపై న్యాయవాది బూటు విసిరేందుకు ప్రయత్నిస్తే క్షమించాలని వెంటనే నిర్ణయం తీసుకున్నానన్నారు. పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ పదవిని అంగీకరించనని స్పష్టం చేశారు. రిటైర్మెంట్ తర్వాత కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నానని ఆ తర్వాత సామాజిక సేవలో పాల్గొంటానని చెప్పారు. సామాజిక సేవ నా రక్తంలోనే ఉందని నేను నా సమయాన్ని గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. కాగా, చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ 2024లో ఎస్సీలు, ఎస్టీలలో కూడా క్రిమీ లేయర్‍ను గుర్తించే విధానాన్ని రాష్ట్రాలు రూపొందించాలని అభిప్రాయపడ్డారు. వారికి రిజర్వేషన్ల ప్రయోజనాన్ని నిరాకరించాలని వెల్లడించారు.

Next Story