- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యాను రాజకీయం చేస్తున్నారు
దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ త్రిభాషా విధానం విద్యా వ్యవస్థలో ఉంది. కానీ తమిళనాడులో మాత్రం ద్విభాషా విధానాన్ని అమలు చేస్తున్నారని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

- హిందీ భాషను రుద్దడం లేదు
- గతంలో విదేశీ భాషపై అతిగా ఆధారపడ్డాం
- ఎన్ఈపీ ఆ పరిస్థితిని సరి చేస్తుంది
- సీఎం స్టాలిన్ లేఖపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ
దిశ, నేషనల్ బ్యూరో: తమిళ భాషను, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్యను రాజకీయం చేయడం తగదు అని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి అన్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)-2020ని పూర్తిగా అమలు చేసి, త్రిభాషా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టే వరకు తమిళనాడుకు సమగ్ర శిక్ష అభియాన్ నిధులు మంజూరు చేయబోమని ఇటీవల కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. ఎస్ఎస్ఏ పథకం ద్వారా రాష్ట్రానికి రావల్సిన రూ.2 వేల కోట్లకు పైగా నిధులను వెంటనే విడుదల చేయాలని స్టాలిన్ ఆ లేఖలో కోరారు. ఈ నిధులు విడుదల చేయకపోతే ఉపాధ్యాయులకు వేతనాలు అందించలేమని, విద్యార్థులకు సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లలేమని స్టాలిన్ చెప్పారు. కాగా, ఈ విషయంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు.
'తమిళనాడు సీఎం స్టాలిన్, డీఎంకే పార్టీలు తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల విద్యా ప్రగతిని దూరం చేస్తున్నారు. ఎన్ఈపీ 2020లో భాగమైన త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని కేంద్రం కోరుతోంది. గత విద్యా విధానంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల భారతీయ భాషలను పద్దతి ప్రకారం బోధించలేదు. విదేశీ భాషలపై అతిగా ఆధారపడటం వల్ల పిల్లలు తమ మాతృభాషలను మరిచిపోయే పరిస్థితి వచ్చింది. తమిళ్ వంటి భాషల అభివృద్ధికి కూడా ఇది ఉపయోగపడుతుంది' అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. త్రిభాషా విధానాన్ని దేశంలో చాలా రాష్ట్రాలు 1960 నుంచి అమలు చేస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ త్రిభాషా విధానం విద్యా వ్యవస్థలో ఉంది. కానీ తమిళనాడులో మాత్రం ద్విభాషా విధానాన్ని అమలు చేస్తున్నారని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
త్రిభాషా విధానంపై ఎప్పుడు మాట్లాడినా అనవసరంగా రాజకీయం చేస్తున్నారు. తమిళనాడులో హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నామని ప్రచారం చేస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఎవరిపై హిందీ భాషను రుద్దడం లేదని చెప్పారు. ఏ భాషను కూడా ఒక రాష్ట్రంలో బలవంతంగా రుద్దాలని ఎన్‌ఈపీలో ఎక్కడా లేదని ప్రధాన్ గుర్తు చేశారు. ఈ విషయాన్ని కూలంకషంగా వివరిస్తూ సీఎం స్టాలిన్‌కు కూలంకషంగా లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. తమిళనాడు కేవలం ఇంగ్లీష్, తమిళ్ మాత్రమే బోధించాలని నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర సరిహద్దుల్లో నివసించే వారు కన్నడ, తెలుగు, మలయాళం భాషలు నేర్చుకోవాలంటే ఎలా? ఉపాధి నిమిత్తం వచ్చిన వారు మరాఠీనో ఒడియానో నేర్చుకోవాలంటే ఏం చేయాలని ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు.
మనం ప్రపంచీకరణ యుగంలో ఉన్నాము. అనేక మంది తమిళ ప్రజలు కూడా దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. 60వ దశకంలో ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. దీన్ని ఎన్‌ఈపీ మాత్రమే సరిదిద్దగలదని మంత్రి చెప్పారు. ఎన్‌ఈపీ గురించి ఎప్పుడు చర్చ వచ్చినా దురదృష్టవశాత్తూ దాన్ని యాంటీ హిందీ చర్చగా తమిళనాడు ప్రభుత్వం మారుస్తుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. దేశంలో ఉన్న అన్ని భాషలూ జాతీయ భాషలే.. అలాగే తమిళ భాష శాశ్వతమైంది. ఇది ఎంతో పురాతనమైన భాష అని గతంలో మోడీ చేసిన వ్యాఖ్యలు కేంద్ర మంత్రి ప్రస్తావించారు.






