- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాలిబన్లతో పాకిస్థాన్, చైనా కీలక ఒప్పందం
పాకిస్థాన్, చైనా మరియు తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం జరిగింది. సీపీఈసీ ప్రాజెక్టును ఆప్ఘనిస్థాన్ వరకు పొడిగించాలని చైనా నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్, చైనా మరియు తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం జరిగింది. సీపీఈసీ ప్రాజెక్టును ఆప్ఘనిస్థాన్ వరకు పొడిగించాలని చైనా నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందంపై మూడు దేశాల ప్రతినిధులు సంతకం చేశారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి చైనా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది. సీపీఈసీ అనేది చైనా పాకిస్థాన్ మధ్య ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్.
ఇది పాకిస్థాన్‌ను చైనాతో కలుపుతూ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా చైనా పాకిస్థాన్ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, కమ్యూనికేషన్ మరింత పెరగనున్నాయి. ప్రాజెక్టు ద్వారా పాకిస్థాన్ ఆర్థికస్థితిని మార్చాలని లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆఫ్ఘనిస్థాన్ వరకు విస్తరించాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ దేశంతో కూడా పాక్, చైనాలకు సంబంధాలు పెరగనున్నాయి. తాలిబన్ల దేశంతోనూ చైనాకు వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఏర్పడతాయి.






