- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
12న ఉప రాష్ట్రపతిగా CP రాధాకృష్ణన్ ప్రమాణం.. హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత 15వ ఉప రాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్ (CP Radha Krishnan) ఎన్నికయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత 15వ ఉప రాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్ (CP Radha Krishnan) ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి (Sudershan Reddy)పై 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉప రాష్ట్రపతి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడినట్లుగా సమాచారం.
కాగా, ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు తొలి ప్రాధాన్యతలోనే 452 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మొదటి ఫస్ట్ ప్రియారిటీగా 300 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. దీంతో సీపీ రాధాకృష్ణ భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికైనట్లుగా ఎన్నికల అధికారులు మంగళవారం ప్రకటించారు. ఈ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 98.4 శాతం పోలింగ్ నమోదు కాగా 767 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో 15 ఓట్లు చెల్లనివిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. 13 మంది ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. వారిలో బీజేడీకి చెందిన ఎంపీలు ఏడుగురు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు నలుగురు, అకాళీదల్ నుంచి ఒకరు ఇండిపెండెంట్ సభ్యుడు మరొకరు ఉన్నారు.






