గవర్నర్‌ పదవికి CP రాధాకృష్ణన్ రాజీనామా.. ఆచార్య దేవవ్రత్‌కు అదనపు బాధ్యతలు

by Kema Shiva Kumar |

భారత 15వ ఉప రాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్ (CP Radha Krishnan) ఎన్నికైన విషయం తెలిసిందే.

గవర్నర్‌ పదవికి CP రాధాకృష్ణన్ రాజీనామా.. ఆచార్య దేవవ్రత్‌కు అదనపు బాధ్యతలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత 15వ ఉప రాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్ (CP Radha Krishnan) ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, నూతన ఉప రాష్ట్రపతిగా ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీపీ రాధాకృష్ణన్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉప రాష్ట్రపతి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కాగా, సీపీ రాధాక‌ృష్ణ ఉప రాష్ట్రపతిగా ఎన్నికవడంతో ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతున్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు కేంద్రం మహారాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలను కట్టబెట్టింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.

Next Story