ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా CP రాధాకృష్ణ నామినేషన్ దాఖలు.. హాజరైన ప్రధాని, కేంద్ర మంత్రులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-20 06:24:06  IST  )

ఉప రాష్ట్రపతి ఎన్నికకు తొలి అడుగు పడింది.

ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా CP రాధాకృష్ణ నామినేషన్ దాఖలు.. హాజరైన ప్రధాని, కేంద్ర మంత్రులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప రాష్ట్రపతి ఎన్నికకు తొలి అడుగు పడింది. ఈ మేరకు ఎన్డీఏ (NDA) అభ్యర్థిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ (Chandrapuram Ponnuswamy Radhakrishnan) ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు అమిత్ షా, ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు కూడా హాజరయ్యారు. 4 సెట్లతో కూడిన నామినేషన్ పత్రాలపై సీపీ రాధాకృష్ణతో పాటు ఎన్డీఏ పక్ష నేతలు సంతకాలు చేశారు. అనంతరం నామినేషన్ పత్రాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోడీకి సీపీ రాధాకృష్ణ, ప్రధాని మోడీ కలిసి అందజేశారు.

Read More : ఎవరు సరైన అభ్యర్థో ఎంపీలే నిర్ణయించాలి.. ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి

Next Story