- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థానేలో కరోనా పేషెంట్ మృతి
థానేలో కరోనా పేషెంట్ మృతి. తీవ్రమైన డయాబెటీస్‌తో సదరు వ్యక్తి ఆస్పత్రి పాలవగా.. కరోనా కూడా సోకడంతో మరణించినట్లు సమాచారం.

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని థానేలో ఒక కరోనా పేషెంట్ మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. థానేలో ప్రస్తుతం 18 కరోనా యాక్టివ్ కేసులున్నాయని, వీరిలో 17 మంది ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. ఒక్క పేషెంట్ మాత్రం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని చెప్పారు. అయితే 21 ఏళ్ల మరో పేషెంట్ మాత్రం తీవ్రమైన డయాబెటీస్‌తో కూడా బాధపడుతున్నాడని, ఆ వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు వివరించారు. గురువారం నాడు తీవ్రమైన డయాబెటీస్ సమస్యతో సదరు వ్యక్తి ఆస్పత్రిలో చేరాడని, అయితే ఆ తర్వాత అతనికి చేసిన కరోనా పరీక్ష ఫలితం పాజిటివ్‌గా తేలిందని వైద్యులు తెలియజేశారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మరణించినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఆస్పత్రిలో ఆర్టీ-పీసీఆర్ టెస్టు సదుపాయాలు, 19 బెడ్లతో ఒక వార్డు కూడా ఏర్పాటు చేశామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.






