- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Covid: పెరుగుతున్న కొవిడ్ కేసులు.. రెండు కొత్త వేరియంట్లతో ఆందోళన !
దేశ వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి.కేరళలో అత్యధిక యాక్టివ్ కేసులు నమోదవగా, తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత ఉన్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: దేశ వ్యాప్తంగా కొవిడ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. కేరళలో అత్యధిక యాక్టివ్ కేసులు నమోదవగా, తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అయితే భారత్‌లో ఎన్బీ 1.8.1, ఎల్ఎఫ్ 7 వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నట్టు ఇన్సాగాగ్ గుర్తించింది. గత నెలలో తమిళనాడులో ఎన్బీ1.8.1 ఒక కేసు నమోదు కాగా, మేలో నాలుగు ఎల్ఎఫ్.7 కేసులు వెలుగు చూశాయి. ఈ వేరియంట్ల వల్ల హాంకాంగ్-సింగపూర్‌లలో కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందింది. దీంతో భారత్‌లోనూ ఆందోళనలు నెలకొన్నాయి. అయితే పరిస్థితి చాలా అదుపులో ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో కేరళలో అత్యధిక యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్రలో ఆదివారం 45 కొత్త కేసులు నమోదయ్యాయి, దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 209కి చేరుకుంది. తమిళనాడులోనూ కేసులు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు కర్ణాటకలో శనివారం ఐదు కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 38కి చేరుకుంది. ఈ కేసుల్లో 32 బెంగళూరులోనే ఉండటం గమనార్హం. కరోనాతో బెంగళూరులో 84 ఏళ్ల వ్యక్తి మరణించినట్టు అధికారులు తెలిపారు. కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది.






