Covid: కరోనాతో ఐదుగురు మృతి.. 6815కు చేరిన యాక్టివ్ కేసులు

by B.Srinivas |

దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 324 కొత్త కేసులు నమోదు కాగా, కొవిడ్‌తో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

Covid: కరోనాతో ఐదుగురు మృతి.. 6815కు చేరిన యాక్టివ్ కేసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 324 కొత్త కేసులు నమోదు కాగా, కొవిడ్‌తో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 6815కు చేరుకుంది. మరణించిన వారిలో కర్ణాటకకు చెందిన ఇద్దరు, కేరళ, ఢిల్లీ, జార్ఖండ్‌లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళలోనే అత్యధికంగా 2053 పాజిటివ్ కేసులున్నాయి. గుజరాత్ లో 1109, పశ్చిమ బెంగాల్‌లో 747, ఢిల్లీలో 691, కర్ణాటకలో 559, ఆంద్రప్రదేశ్ లో 86, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులున్నాయి. కొవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల రాష్ట్రంలోని అన్ని ప్రధాన విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని కేరళ ప్రభుత్వం అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది.

Next Story