- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Covid-19 cases: ఆసియాలో విజృంభిస్తున్న కరోనా.. కారణాలు ఏంటంటే?
ఆసియాలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయ్‌లాండ్‌తో పాటు చైనాలోనూ కొవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఆసియాలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయ్‌లాండ్‌తో పాటు చైనాలోనూ కొవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. భారత్‌లోనూ కొన్ని కేసులు నమోదవుతున్నప్పటికీ.. తీవ్రత తక్కువేనని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అయినా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. సింగపూర్ ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం ఏప్రిల్ చివరి వారంలో 14వేల కరోనా (Covid 19) కేసులు నమోదయ్యాయి. అంతుకుముందు వారం కూడా దాదాపు 11 వేల కేసులు రికార్డయ్యాయి. రోజూ 100 మంది బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్నారని.. కానీ, ఐసీయూలో చేరికలు మాత్రం తక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. థాయ్‌లాండ్‌లోనూ వారానికి వేల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. మే రెండో వారంలోనే 33వేల కేసులు రికార్డయినట్లు అంచనా. ఒమిక్రాన్ ఎక్స్‌ఈసీ వేరియంట్ వల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. హాంకాంగ్ లోనూ కేసులు పెరుగుతున్నాయి. చైనాలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని బీజింగ్ ఆరోగ్యశాఖ పేర్కొంది. గత ఐదు వారాలుగా ఆసుపత్రులకు వెళ్తున్న వారి సంఖ్య సాధారణంతో పోలిస్తే రెట్టింపు అయినట్లు తెలిపింది. కేసుల పాజిటివిటీ రేటు 7.8శాతం నుంచి 16శాతానికి పెరగగా.. హాస్పిటల్స్ లో చేరే వారి శాతం 3 నుంచి 6కి పెరిగినట్లు తెలుస్తోంది.
కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే..?
మరోవైపు, ఆసియా దేశాల్లో ప్రస్తుతం వైరస్ వ్యాప్తికి జేఎన్.1 వేరియంట్, దాని ఉపరకాలే కారణమని అధికారులు చెబుతున్నారు. జేఎన్.1 ఉపరకాలైన ఎల్‌ఎఫ్.7, ఎన్‌బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని సింగపూర్ ఆరోగ్యశాఖ తెలిపింది. స్థానికంగా సీక్వెన్స్ చేసిన కేసుల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ కేసులు ఇవేనని పేర్కొంది. ప్రస్తుత క వ్యాక్సిన్‌లో జేఎన్.1 వేరియంట్‌ను వాడినట్లు తెలుస్తోంది. అయితే, సీజన్, వాతావరణ పరిస్థితులు, సామూహిక కార్యక్రమాలు, ప్రయాణాలు పెరగడం కరోనా వ్యాప్తికి కారణమని సింగపూర్ ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రజల్లో రోగనిరోధక శక్తి క్షీణించడం కూడా ఇందుకు కారణమని చెప్పింది. కరోనా వైరస్ స్థానిక వ్యాధిగా పరిణామం చెందిందని హాంకాంగ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.అంతేకాకుండా, వైరస్ వేరియంట్లలో కలిగే మార్పులు ప్రస్తుత వ్యాప్తికి సంబంధం ఉందని, దీంతోపాటు హెర్డ్ ఇమ్యూనిటీ తగ్గడం కూడా మరో కారణంగా పేర్కొంది. అయితే, ప్రస్తుతం ఆసియా దేశాల్లో వైరస్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న జేఎన్.1 రకం ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ మాత్రమేనని, ఆందోళన కలిగించే రకం (Variant of Concern) కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే వెల్లడించింది.






