- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi: అసెంబ్లీ ఎన్నికల వేళ ఢిల్లీ సీఎంకు షాక్..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి అతిషీకి(Delhi CM Atishi) షాక్ తగిలింది. ఆమెపైన కాంగ్రెస్ మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్(former Congress MP Sandeep Dikshit) పరువునష్టం దావా(defamation case) వేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి అతిషీకి(Delhi CM Atishi) షాక్ తగిలింది. ఆమెపైన కాంగ్రెస్ మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్(former Congress MP Sandeep Dikshit) పరువునష్టం దావా(defamation case) వేశారు. కాగా.. ఈ కేసులోనే ఆమెకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అతిషీతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కి కూడా ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదుపైనే ఢిల్లీ కోర్టు సమన్లు ఇచ్చింది. ఈ వ్యవహారంపై ఆప్ నేతలు జనవరి 27లోగా సమాధానం ఇవ్వాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. బీజేపీ నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారని అతిషీ, సంజయ్ సింగ్ మీడియా సమావేశంలో ఆరోపించారని సందీప్ దీక్షిత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ బీజేపీతో జతకట్టి ఆప్ ను ఓడించేందుకు ఆ ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. ఆప్ నేతలిద్దరూ ఉద్దేశపూర్వకంగానే తన ప్రతిష్టకు హాని కలిగించారని సందీప్ దీక్షిత్ ఆరోపించారు. మరోవైపు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi assembly polls) న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు. ఆయనపైనే దీక్షిత్ పోటీ చేస్తున్నారు. ఇకపోతే, త్వరలోనే ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.






