- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi High Court : సోనియాకు, రాహుల్ కు నోటీసులు ఇచ్చేందుకు కోర్ట్ నిరాకరణ
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు(National Herald Case)లో రాహుల్ గాంధీ(Rahul Gandhi), సోనియా గాంధీ(Sonia Gandhi)కి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్ట్(Delhi High Court) నిరాకరించింది.

దిశ, వెబ్ డెస్క్ : నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు(National Herald Case)లో రాహుల్ గాంధీ(Rahul Gandhi), సోనియా గాంధీ(Sonia Gandhi)కి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్ట్(Delhi High Court) నిరాకరించింది. ఈ కేసులో వారు ఇరువురు విచారణకు హాజరయ్యేలా నోటీసులు జారీ చేయాలని కోరుతూ ఈడీ(ED) ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నోటీసులు ఇచ్చేముందు అందులో ఏదైనా లోపం ఉందా అని పరిశీలించాల్సిన అవసరం ఉందన్న న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే.. చార్జ్ షీటులో పలు కీలక పత్రాలు లేవని తెలిపారు. నూతన చట్టాల ప్రకారం విచారణ జరపకుండా దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆధారంగా రాహుల్, సోనియాకు నోటీసులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
ఆ పత్రాలను దాఖలు చేయాలని, వాటిని పరిశీలించిన అనంతరం నోటీసుల జారిపై నిర్ణయం తీసుకుంటామని ఈడీకి తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను మే 2కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ధర్మాసనం. కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ.. అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతోపాటు.. శామ్ పిట్రోడా, సుమన్ దూబేల పేర్లను చేర్చింది. ఈ కేసుతో ముడిపడి ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి నోటీసులు కూడా జారీ చేసింది ఈడీ.






