కాపురంలో ఉల్లి, వెల్లుల్లి చిచ్చు.. 11 ఏళ్ల దాంపత్యానికి వీడ్కోలు

by Naga Rani Yarlagadda |

పెళ్లంటే నూరేళ్ల పంటగా ఉండాలనేవారు పెద్దలు. కానీ.. ఈ జనరేషన్లో పెళ్లంటే మూన్నాళ్ల ముచ్చటగా మారుతోంది.

కాపురంలో ఉల్లి, వెల్లుల్లి చిచ్చు.. 11 ఏళ్ల దాంపత్యానికి వీడ్కోలు
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లంటే నూరేళ్ల పంటగా ఉండాలనేవారు పెద్దలు. కానీ.. ఈ జనరేషన్లో పెళ్లంటే మూన్నాళ్ల ముచ్చటగా మారుతోంది. చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకుని విడిపోతున్నారు. కాపురం అన్నాక చిన్న చిన్న గొడవలు రావడం సహజం. ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. కానీ.. ఈ దంపతుల మధ్య వంటగదిలో మొదలైన ఉల్లి, వెల్లుల్లి లొల్లి.. విడాకులు తీసుకుని వీడ్కోలు పలికేంతవరకూ వెళ్లింది.

గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన జంటకు 2002లో పెళ్లయింది. ఇద్దరిదీ వేర్వేరు వర్గాలు. భార్యకు ఉల్లి, వెల్లుల్లి తినడం నచ్చదు. ఇంట్లో కూడా వాటిని వాడొద్దని భర్తకు తరచూ చెప్పేది. దీని కారణంగా కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగి, గొడవలు పడేవారు. భర్త, కొడుకుని వదిలి వెళ్లిపోయింది. దీంతో భర్త విడాకులు కావాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ గుజరాత్ హైకోర్టులో భార్య అప్పీలు చేసింది. ఆమె పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించి, ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.

Next Story