- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sharon Raj murder case: బ్రేకప్ కు నో చెప్పిన ప్రియుడిని చంపిన ప్రియురాలు.. ఉరిశిక్ష విధించిన కోర్టు
బ్రేకప్ కు నో చెప్పిన ప్రియుడిని చంపిన ప్రియురాలికి కోర్టు ఉరిశిక్ష విధించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: విడిపోయేందుకు నిరాకరించాడని బాయ్ ఫ్రెండ్ కు స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేసిన ప్రియురాలికి తిరువనంతపురం కోర్టు (Thiruvananthapuram court) ఉరి శిక్ష విధించింది. ఆమెతో పాటు ఈ హత్యకు సహకరించిన బంధువుకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గ్రీష్మ (Greeshma).. రేడియోలాజీ స్టూడెంట్ షారోన్ రాజ్ (Sharon Raj) అనే యువకుడితో చాలా కాలంగా ప్రేమాయనం సాగించింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఆమెకు మరో సంపన్న వ్యక్తితో వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో షారోన్ రాజ్ ను దూరం పెట్టాలని గ్రీష్మ భావించింది. తనను పెళ్లి చేసుకుంటే ప్రియుడు చనిపోతాడని ఓ జ్యోతిష్యుడు తనకు చెప్పాడని కట్టుకథ అల్లింది. ఆమెతోనే కలిసి జీవించాలనుకున్న సదరు యువకుడు ఇదంతా మూఢనమ్మకం అని కొట్టిపారేశాడు. అయితే షారోన్ రాజ్ ను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన గ్రీష్మ 2022లో తన ప్రియుడికి జ్యూస్ చాలెంజ్ పేరుతో నెమ్మదిగా స్లోపాయిజన్ ఇవ్వడం ప్రారంభించింది. అలా 2022 సంవత్సరంలో ఓ రోజు జ్యూస్ తాగిన వెంటనే షారోన్ రాజ్ కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరాడు. అయితే అప్పటికే అవయవాలు పూర్తిగా దెబ్బతినడంతో అతడు ప్రాణాలు విడిచాడు. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు గ్రీష్మను దోషిగా నిర్థారించి ఇవాళ శిక్ష ఖరారు చేసింది.






