- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రంప్ టారిఫ్ నిర్ణయానికి కౌంట్‌డౌన్ ప్రారంభం.. జులై 9 ముందే దేశాలకు లేఖలు
ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన ప్రతీకార సుంకాల (Trump Tariffs) అమలుకు మూడే రోజులు మిగిలి ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన ప్రతీకార సుంకాల (Trump Tariffs) అమలుకు మూడే రోజులు మిగిలి ఉన్నాయి. టారిఫ్‌లపై ఉన్న జులై 9 డెడ్‌లైన్‌ను గతంలో పొడిగించవచ్చు లేదా కుదించవచ్చు అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసినా, తాజా చర్యలు చూస్తే పొడిగింపు అవకాశాలు కనిపించడం లేదు. ఈ గడువు పూర్తయ్యేలోగా ఆయా దేశాలకు తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ ట్రంప్ ప్రభుత్వం లేఖలు పంపించేందుకు సిద్ధమైంది.
శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం) నుంచి రోజుకు 10 దేశాల చొప్పున దశలవారీగా ఈ లేఖలు పంపనున్నట్టు ట్రంప్ వెల్లడించారు. 'అమెరికాతో వ్యాపారం చేయాలంటే ఎంత చెల్లించాలో (టారిఫ్‌లు) స్పష్టంగా తెలియజేసేందుకు ఆయా దేశాలకు లేఖలు పంపించనున్నాం' అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనతో గడువు పొడిగింపుపై అన్ని అంచనాలకు ముగింపు పలికినట్లైంది.
ఈ ప్రతీకార సుంకాలను ట్రంప్ 2025 ఏప్రిల్ 2న ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్, చైనా, బ్రిటన్ వంటి కీలక దేశాలపై భారీగా సుంకాలు విధిస్తూ, తాత్కాలికంగా 90 రోజుల గడువు ఇచ్చారు. ఈ లోగా అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోతే, ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కొత్త టారిఫ్‌లు అమలు చేస్తామని ట్రంప్ స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఆ గడువు ముగియనుండటంతో వాణిజ్య చర్చలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. భారత్‌తో ఇప్పటికీ చర్చలు కొనసాగుతుండగా, వచ్చే రెండు రోజుల్లో మినీ ట్రేడ్ డీల్ కుదిరే అవకాశాలున్నాయి. మరోవైపు చైనాతో ఇప్పటికే ఒక ఒప్పందం కుదిరిందని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న ఈ చర్యలు ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై మరింత ఒత్తిడిని తీసుకువచ్చే అవకాశముంది.






