- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేరెంట్స్‌కు BIG అలర్ట్: ఆ దగ్గుమందు తాగి 12 మంది చిన్నారులు మృతి
కాఫ్ సిరప్‌ల తయారీపై కేంద్రం చర్యలు ప్రారంభించింది. శుక్రవారం ఓ ప్రముఖ ఫార్మా కంపెనీకి చెందిన సిరప్‌లపై కేంద్రం నిషేధం విధించింది.

దిశ, వెబ్‌డెస్క్: కాఫ్ సిరప్‌ల తయారీపై కేంద్రం చర్యలు ప్రారంభించింది. శుక్రవారం ఓ ప్రముఖ ఫార్మా కంపెనీకి చెందిన సిరప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. అంతేకాదు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దగ్గుమందు పంపిణీని నిలిపివేసింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ ప్రభుత్వం కోసం ఓ ఫార్మా కంపెనీ దగ్గు మందును తయారు చేసింది. ఈ దగ్గు మందు పిల్లల పాలిట మృత్యువుగా మారింది. ఈ దగ్గు మందు తీసుకున్న పిల్లల్లో 12 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్‌లో 9 మంది, రాజస్థాన్‌లో ముగ్గురు మృతిచెందారు. మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. గత 2 వారాల వ్యవధిలో ఈ ఘనలు చోటు చేసుకున్నాయి. దీంతో బాధితుల నుంచి NCFDC శాంపిల్స్ సేకరించింది. గత వారం రోజుల్లో దక్షిణ రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాలో ఒకటి నుండి 5 సంవత్సరాల వయస్సు గల ఎనిమిది మంది పిల్లలు కూడా ఈ ఔషధం సేవించి అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందింది.






