- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Costa Rica: కోస్టారికాకు అక్రమ వలసదారులు.. అమెరికాతో డీల్
అమెరికా నుంచి బహిష్కరించబడిన అక్రమ వలసదారులను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు కోస్టారికా ప్రకటించింది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా నుంచి బహిష్కరించబడిన అక్రమ వలసదారుల (Illigal immigrants)ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు కోస్టారికా (cosra rica) ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. భారతదేశంతో సహా మధ్య ఆసియాలోని వివిధ దేశాల అక్రమ వలసదారులను అనుమతించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. మధ్య ఆసియా, భారత్ నుంచి 200 మంది వలసదారులు బుధవారం యూఎస్ నుంచి కోస్టారికాకు చేరుకోనున్నారు. మొదటి బ్యాచ్ వలసదారులను వాణిజ్య విమానం ద్వారా కోస్టారికాకు తీసుకువస్తారు. అక్కడి నుంచి వారిని పనామా సరిహద్దుకు సమీపంలో ఉన్న తాత్కాలిక వలస సంరక్షణ కేంద్రంలో ఉంచుతారు. ఆ తరువాత వారి స్వస్థలాలకు తరలిస్తారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) పర్యవేక్షణలో ఈ ప్రక్రియకు పూర్తిగా నిధులు సమకూరుస్తుందని కోస్టారికా పేర్కొంది.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యూఎస్ నుంచి బహిష్కరించబడిన వలసదారులను స్వదేశానికి రప్పించడంలో సహకరించిన మధ్య అమెరికాలోని మూడో దేశంగా కోస్టారికా నిలిచింది. అంతకుముందు గ్వాటెమాల, పనామా కూడా అమెరికాతో ఇలాంటి ఒప్పందానికి అంగీకరించాయి. ఈ నేపథ్యంలోనే పనామా గత వారం చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇతర దేశాల నుంచి 119 మంది వలసదారులను అంగీకరించింది. గ్వాటెమాల ఇంకా వలసదారులను స్వీకరించలేదు. కాగా, ఇప్పటి వరకు మూడు విడతలుగా భారత్ అక్రమ వలసదారులను యూఎస్ స్వదేశానికి పంపించిన విషయం తెలిసిందే.






