- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు-2026: జాయింట్ కమిటీ చైర్మన్‌గా సుధీర్ గుప్తా నియామకం
కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు-2026పై అధ్యయనానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మొత్తం 31 మందితో జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ‘కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు-2026’పై అధ్యయనం కోసం పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన జాయింట్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీకి చైర్మన్‌గా లోక్‌సభ సభ్యులు ఎంపీ సుధీర్ గుప్తాను నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ రాత్రి లోక్‌సభ కమిటీ బ్రాంచ్ ఓ అధికారిక బులెటిన్‌ను విడుదల చేసింది.
కమిటీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు..
ఈ సంయుక్త కమిటీలో లోక్‌సభ మరియు రాజ్యసభకు చెందిన మొత్తం 31 మంది సభ్యులకు చోటు కల్పించారు. వీరిలో లోక్‌సభ నుండి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖ ఎంపీలు చోటు దక్కించుకోవడం విశేషం. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి లోక్‌సభ తరఫున సభ్యులుగా ఎంపిక కాగా.. రాజ్యసభ తరఫున వైఎస్ఆర్‌సీపీ ఎంపీ ఎస్.నిరంజన్ రెడ్డి, టీడీపీ ఎంపీ బీద మస్తాన్ రావులకు ఈ కమిటీలో చోటు లభించింది.






