Corona virus: మరోసారి భయపెడుతున్న కరోనా.. కొత్త వేరియంట్ లక్షణాలు ఇవే..?

by Yella Dhawani Reddy |

ఐదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా మహామ్మారి కరోనా వైరస్ విలయ తాండవం సృష్టించిన సంగతి తెలిసిందే.

Corona virus: మరోసారి భయపెడుతున్న కరోనా.. కొత్త వేరియంట్ లక్షణాలు ఇవే..?
X

దిశ, వెబ్ డెస్క్: ఐదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా మహామ్మారి కరోనా వైరస్ విలయ తాండవం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ చేదు జ్ఞాపకాల నుంచి ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నామనుకునే సమయంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. భారత్ సహా పలు దేశాల్లో కరోనా వైరస్ బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం మన దేశంలో 257కి పైగా యాక్టివ్ కేసులున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిపిన పరీక్షల్లో కొత్త వేరియంట్లు జేఎన్‌.1 ఉపరకాలైన ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్‌.7లను గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) శనివారం వెల్లడించింది.

ఇక ఎన్‌బీ.1.8.1 రకం కేసు ఏప్రిల్‌లో వెలుగుచూడగా.. ఎల్‌ఎఫ్‌.7 కు సంబంధించి నాలుగు కేసులు మే నెలలో గుర్తించినట్లు తెలిపింది. అవి తమిళనాడు, గుజరాత్‌లో నమోదయ్యాయి. అయితే, మునుపటి వేరియంట్లతో పోలిస్తే ఎన్.1.8.1, ఎల్ఎఫ్.7 అంత ప్రమాదకరమైనవి కావని అధికారులు తెలిపారు. శరీరంలోని కొన్ని ప్రొటీన్లకు ఇవి బలంగా అనుసంధానం అవుతున్న కారణంగా వ్యాప్తి వేగం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇక ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కొత్తగా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో అన్ని ప్రభుత్వాలు ఆసుపత్రులను అప్రమత్తం చేశాయి. కేసులు నమోదవుతున్నప్పటికీ.. తీవ్రత తక్కువేనని ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అలాగని అజాగ్రత్తగా ఉండకూడదని, కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది.

కొత్త వేరియంట్ల లక్షణాలివే

* వైరస్ సోకిన వెంటనే గొంతుపై ప్రభావం చూపిస్తోంది. ఈ కారణంగానే విపరీతంగా పొడి దగ్గు వస్తోంది.

* అలాగే జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలతో ఇబ్బంది పడుతుంటారు.

* ఈ వేరియంట్లు సోకిన వాళ్లలో నోట్లో కురుపులు వస్తున్నాయి.

* రుచి, వాసన కోల్పోతారు. డయేరియా కూడా ఇబ్బంది పెడుతోంది.

Next Story