కరోనా కలకలం.. మరొకరి మృతి

by Vemula.Srinu Prasad |

కర్ణాటకలో కరోనా మృతి కలకలం రేపింది..

కరోనా కలకలం.. మరొకరి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా(Corona) మరోసారి కలకలం రేపుతోంది. చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏపీ(AP), తెలంగాణ(Telangana)తో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక(Karnataka)లోనూ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా కర్ణాటకలో కరోనాతో వృద్ధుడు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు కలగడంతో 63 ఏళ్ల వృద్ధుడు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే వైద్యులు చికిత్స అందించారు. అంతుకు ఆయన మూత్ర పిండలు, ఊపరితిత్తుల వ్యాధితో దీర్ఘకాలికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. గతంలో రెండు కోవీషీల్డ్ వ్యాక్సిన్లు సైతం తీసుకున్నారు. అయితే కరోనాతో చికిత్స పొందుతూ మైసూర్(Mysur) ఆస్పత్రిలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Next Story