క‌రోనా అప్డేట్..దేశంలో కొత్త‌గా 363 కేసులు

by Ajay Maddhiboyina |

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 363 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,758 ఉండ‌గా గ‌డిచిన 24 గంట‌ల్లో 1818 మంది వైర‌స్

క‌రోనా అప్డేట్..దేశంలో కొత్త‌గా 363 కేసులు
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 363 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,758 ఉండ‌గా గ‌డిచిన 24 గంట‌ల్లో 1818 మంది వైర‌స్ నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అంతే కాకుండా 24 గంట‌ల్లో క‌రోనాతో ఇద్ద‌రు మ‌ర‌ణించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 28కి చేరుకుంది. దేశంలో అత్య‌ధిక కేసులు కేర‌ళ‌లో న‌మోద‌వుతున్నాయి. దేశంలో న‌మోదైన కేసుల్లో ఆ రాష్ట్రం నుండే స‌గం కేసులు రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో 1,400 యాకివ్ కేసులు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే ఏపీలో 23 కేసులు ఉండ‌గా, తెలంగాణ‌లో 3 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం పెద్ద‌గా లేక‌పోయినా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో మ‌హమ్మారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

Next Story