- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆప్ ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ ఇంట్లో సోదాలు
అమానుతుల్లా ఖాన్‌కు 88,943 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 65,304 ఓట్లు, ఎంఐఎం అభ్యర్థికి 39,558 ఓట్లు వచ్చాయి. ఓక్లా నుంచి ఖాన్ వరుసగా మూడో సారి విజయం సాధించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఒక హత్య కేసులో నిందితుడిని అమానుతుల్లా ఖాన్ అనుచరులు పోలీస్ కస్టడీ నుంచి విడిపించారన్న ఆరోపణల నేపథ్యంలో సోమవారం ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. 'విషయం ఏంటో మాకు తెలియదు. మేం ఆఫీసులో పని చేసుకుంటూ ఉండగా పోలీసులు వచ్చారు. ఆ సమయంలో డోర్లు మూసి ఉన్నాయ. దీంతో వాటిని తెరవమని అడిగారు. మేం పోలీసులు చెప్పినట్లుగానే చేశాం. ఇంట్లో కాసేపు సోదాలు చేశారు. కానీ వారికి ఏమీ దొరకలేదు. అసలు ఎందుకు వచ్చారో కూడా పోలీసులు మాకు చెప్పలేదు' అని అమానుతుల్లా ఖాన్ అనుచరుడు ఒకరు చెప్పారు. కాగా, ఢిల్లీ వక్ఫ్ బోర్డులో జరిగిన అక్రమాలు,మనీ లాండరింగ్ కేసులో గతేడాది అమానుతుల్లా ఖాన్‌ను ఈడీ అరెస్టు చేసింది. రెండు నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత నిరుడు నవంబర్ 15న ఖాన్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసంది. కాగా, తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓక్లా నియోజకవర్గం నుంచి పోటీ చేసన అమానుతుల్లా ఖాన్ బీజేపీ అభ్యర్థి మనీష్ చౌదరిపై 23,639 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అమానుతుల్లా ఖాన్‌కు 88,943 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 65,304 ఓట్లు, ఎంఐఎం అభ్యర్థికి 39,558 ఓట్లు వచ్చాయి. ఓక్లా నుంచి ఖాన్ వరుసగా మూడో సారి విజయం సాధించారు.






