- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pahelgam attack: పహెల్గాం ఉగ్రదాడిలో చైనా యాప్ ల సహకారం!.. తెరపైకి సంచలన విషయాలు
పహెల్గాం దాడిలో ఉగ్రవాదులు కమ్యూనికేషన్ కోసం చైనా యాప్ లను వినియోగించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూకాశ్మీర్ పహెల్గాంలో (Pahalgam attack) జరిగిన ఉగ్రదాడికి సంబంధించి రోజుకో కొత్త సంగతి వెలుగులోకి వస్తోంది. 26 మంది అమాయకులను బలితీసుకున్న ఈ దాడికి పాల్పడింది తామేననని తొలుత ప్రకటించిన పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తున్న లష్కరోతోయిబా అనుబంధ సంస్థ ది రిసెస్టెన్స్ ఫ్రంట్ తాజాగా మాట మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం ఈ దాడి వెనుక ఉన్న వారెవరైనా వదిలే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
చైనా యాప్ ల సహకారం..
ఈ దాడికి సంబంధించిన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహెల్గాం దాడిలో కమ్యూనికేషన్ కోసం ఉగ్రవాదులు (Terrorists) చైనీస్ యాప్ లు ఉపయోగించినట్లు నిఘా వర్గాలు తాజాగా గుర్తించాయి. పాకిస్తాన్ సరిహద్దు వెంబడి తమ హ్యాండ్లర్లతో కమ్యూనికేట్ చేయడానికి ఉగ్రవాదులు చైనీస్ యాప్ (Chinese apps) యూజ్ చేశారని వీటిలో చాలా యాప్ లో ఎన్ క్రిప్ట్ చేయబడ్డారని వాడిని ఛేదించడం కష్టం అనే అభిప్రాయాలను అధికారులు వెలిబుచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు తమ కథనాల్లో వెల్లడించింది. ఈదాడి కోసం పలు డివైజ్ లను సైతం తీవ్రవాదులు వినియోగించారని, పహెల్గాం వద్ద ఓ చైనీస్ శాటిలైట్ ఫోన్ ను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి 2020 గాల్వాన్ ఘర్షణల తర్వాత చైనా యాప్ లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా తాజా దాడిలో ఉగ్రవాదులు చైనా యాప్ ల సహకారంతో ఈ దారుణానికి పాల్పడినట్లు నిఘా వర్గాలు గుర్తించడం సంచలనంగా మారింది.
పాక్ కు చైనా అండ:
భారత్-పాక్ విషయంలో చైనా మరోసారి తన కుయుక్తిని బయటపెట్టింది. పహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ కు మద్దతు తెలుపుతూ, పాక్ భద్రతపై చైనా ఆందోళనలను అర్థం చేసుకుంటున్నట్లు చైనా పేర్కొంది.భారత్ చర్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పాక్ ఉప ప్రధాని మహ్మద్ ఇషాక్ తో ఫోన్ లో మాట్లాడిన సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఈ మేరకు భరోసా ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు చైనా పాక్ విషయంలో మద్దతు తెలపడం మరో వైపు పహెల్గాం దాడిలో చైనా యాప్ ల ద్వారానే ఉగ్రవాదాలు సమాచార మార్పిడి జరిగిందనే అంచనాలతో ఈ దాడి వెనుక చైనా పాత్ర ఏంటి అనేది సందేహాలకు తావిస్తోంది.






