- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలపై మరో పిడుగు.. వంటగ్యాస్ బుకింగ్ గడువు మళ్లీ పెంపు
ప్రజలకు కేంద్రం మరోసారి షాకిచ్చింది. వంటగ్యాస్ (LPG) సిలిండర్ల బుకింగ్ గడువును మరోసారి పెంచింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలకు కేంద్రం మరోసారి షాకిచ్చింది. వంటగ్యాస్ (LPG) సిలిండర్ల బుకింగ్ గడువును మరోసారి పెంచింది. ఇప్పటికే పట్టణాల్లో సిలిండర్‌కు, సిలిండర్‌కు మధ్య కనీస గడువును 21 రోజుల నుండి 25 రోజులకు పెంచగా... తాజాగా గ్రామాలల్లోనూ నిబంధనలు విధించారు. గ్రామాల్లో కూడా సిలిండర్‌కు, సిలిండర్‌కు మధ్య కనీస గడువును 25 రోజుల నుండి 45 రోజులకు పెంచారు. ఈ కొత్త నిబంధన, అక్రమ నిల్వలను (Hoarding) అరికట్టేందుకు మరియు సరఫరాను క్రమబద్ధీకరించేందుకు అమలులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు.. దేశవ్యాప్తంగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 పెరిగింది. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థలు వినియోగించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.115 పెరిగింది. ఈ పెంపు వెంటనే అమల్లోకి రావడంతో వినియోగదారులు అదనపు భారం భరించాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.965గా ఉంది. ఇతర నగరాల్లో కూడా ధరలు ఇదే విధంగా పెరిగాయి. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వల్లే ఎల్పీజీ ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.






