Zelensky : ట్రంప్ తో వివాదం..స్వదేశంలో జెలెన్ స్కీకి జన నీరాజనం!

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-03-01 11:54:46  IST  )

రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తో వైట్ హౌస్(White House) వేదికగా సాగిన చర్చల సందర్భం ఉక్రెయిన్ అధ్యక్షుడు(Ukrainian President) జెలెన్ స్కీ (Zelensky)సాగించిన వాగ్యుద్ధం ఆయనను సొంత దేశం ప్రజల్లో హీరోను చేసింది.

Zelensky : ట్రంప్ తో వివాదం..స్వదేశంలో జెలెన్ స్కీకి జన నీరాజనం!
X

దిశ, వెబ్ డెస్క్ : రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తో వైట్ హౌస్(White House) వేదికగా సాగిన చర్చల సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు(Ukrainian President) జెలెన్ స్కీ (Zelensky)సాగించిన వాగ్యుద్ధం ఆయనను సొంత దేశం ప్రజల్లో హీరోను చేసింది. ట్రంప్ తో వివాద ఘటన పరిణామాలు ఎలా ఉంటాయోగాని జెలెన్ స్కీ వ్యవహరించిన తీరును ఉక్రెయిన్ ప్రజలు ప్రశంసిస్తున్నారు.

వైట్ హౌస్ తో యుద్ధం చేశారంటూ జెలెన్ స్కీని సోషల్ మీడియా వేదికగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్ సహా పలు యూరోపియన్ దేశాలు కూడా జెలెన్ స్కీకే తమ మద్ధతు తెలిపాయి. వైట్ హౌస్ లో చర్చల సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో రాజీ పడాలని..తాను శాంతిదూతగా ఉంటానని..లేదంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందంటూ ట్రంప్ ఎంత బెదిరించే ధోరణిలో మాట్లాడినా..ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా మధ్యలో మరింత హెచ్చరిక వ్యాఖ్యలు చేసిన ఏ మాత్రం తగ్గకుండా జెలెన్ స్కీ వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

పుతిన్ హంతకుడని..ఘాటుగా రిప్లై ఇచ్చారు. శాంతిచర్చల చొరవకు ప్రతిఫలంగా అమెరికాకు ఉక్రెయిన్ లో ఖనిజాల తవ్వకం ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉన్నా మధ్యలోనే జెలెన్ స్కీని బయటకు వచ్చారు. ఇప్పటికే అగ్ర రాజ్యం రష్యాతో యుద్ధం చేస్తున్నప్పటికి మిత్రదేశం అమెరికా అధ్యక్షుడు ఒత్తిడికి తలొగ్గని జెలెన్ స్కీ పై సొంత దేశ ప్రజలు హీరోగా చూస్తున్నారు. వైట్ హౌజ్ చర్చల వీడియోలు చూసిన వారు జెలెన్ స్కీకి తమ మద్ధతు తెలుపుతున్నారు.

మరోవైపు వైట్ హౌస్ శాంతిచర్చలు విఫలమైన నేపథ్యంలో జెలెన్ స్కీ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఉక్రెయిన్ గళాన్ని వినడం..దాన్ని మర్చిపోకపోవడం చాల ముఖ్యమంటూ జెలెన్ స్కీ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.

Next Story