నాన్న.. నా చావుకు కారణం తారిఖ్, అతని కుటుంబమే.. కాంట్రాక్ట్ టీచర్ ఆత్మహత్య

by Sujitha Rachapalli |

యూపీ మీరట్‌లో విషాదం చోటు చేసుకుంది. సీసీఎస్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ నైమా ఆత్మహత్య చేసుకుంది. బాయ్ ఫ్రెండ్, అతని కుటుంబం చేస్తున్న మానసిక, శారీరక వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొంది

నాన్న.. నా చావుకు కారణం తారిఖ్, అతని కుటుంబమే.. కాంట్రాక్ట్ టీచర్ ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్ : యూపీ మీరట్‌లో విషాదం చోటు చేసుకుంది. సీసీఎస్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ నైమా ఆత్మహత్య చేసుకుంది. బాయ్ ఫ్రెండ్, అతని కుటుంబం చేస్తున్న మానసిక, శారీరక వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ‘నాన్న.. నేను చనిపోతున్నా.. నా చావుకు కారణం తారిఖ్, అతని తల్లిదండ్రులు, తోబుట్టువులే కారణం. నేను పెళ్లి కోసం నిరసన తెలిపినప్పుడు నన్ను దారుణంగా కొట్టారు’ అని తెలిపింది. తన గదిలో ఉరేసుకుని చనిపోయింది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆమె మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తారిఖ్, అతని తల్లిదండ్రులు, తోబుట్టువులపై కేసు ఫైల్ చేశారు.

Next Story