- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం సార్.. నేను చనిపోతున్నా.. నా భర్త, అత్తామామలను వదలొద్దు.. కానిస్టేబుల్ భార్య సూసైడ్(వీడియో)
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం చోటు చేసుకుంది. బక్షీ కా తలాబ్ (BKT) పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అనురాగ్ సింగ్ భార్య సౌమ్య కశ్యప్.. ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. వరకట్న వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకుంది

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం చోటు చేసుకుంది. బక్షీ కా తలాబ్ (BKT) పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అనురాగ్ సింగ్ భార్య సౌమ్య కశ్యప్.. ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. వరకట్న వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకుంది. సూసైడ్‌కు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో సౌమ్య.. భర్త, అత్తమామలు తనను టార్చర్ చేశారని ఆరోపించింది. శారీరకంగా హింసించారని.. భర్తకు మరో స్త్రీతో పెళ్లి చేసేందుకు ట్రై చేస్తున్నారని చెప్పింది. గాయాలను చూపిస్తూ కన్నీరు పెట్టుకుంది. తాను చనిపోతున్నానని.. వీరిని మాత్రం వదలొద్దని సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేసింది. నన్ను చంపితే బయటపడతాడని భర్తకు అత్తామామలు నూరిపోశారని.. ఆయన కూడా తాను పోలీసు అని, ఏమీ చేయలేవని హెచ్చరించాడని చెప్పింది. కాగా కేసు ఫైల్ చేసిన పోలీసులు.. వీడియో ఆధారంగా విచారణ జరుపుతున్నారు.






