Flash News: జమ్మూకశ్మీర్‌లోని జైళ్లపై ఉగ్రదాడికి కుట్ర?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-05 04:12:52  IST  )

జమ్మూకశ్మీర్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. తాజాగా అక్కడి జైళ్లపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని వార్తలు రావడంతో.. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

Flash News: జమ్మూకశ్మీర్‌లోని జైళ్లపై ఉగ్రదాడికి కుట్ర?
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత భారత్ - పాకిస్థాన్ (India - Pakistan) సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఏ క్షణానైనా ఇరుదేశాల మధ్య యుద్ధం జరిగే ఛాన్స్ ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. ఆర్మీ అధికారులు ఎప్పటికప్పుడు సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా హై అలర్ట్ కొనసాగుతోంది. తాజాగా జమ్మూకశ్మీర్ (Jammu&Kashmir) లోని జైళ్లపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని వార్తలు రావడంతో.. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పూంఛ్ జిల్లాలో ఐదు ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నత అధికారులు జైళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీఐఎస్ఎఫ్ (CISF) బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్ సభ్యులు జైళ్లపై అటాక్ చేసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో జైళ్ల భద్రతపై సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ సమీక్ష నిర్వహించారు.

మరోవైపు పాక్ సైన్యం నియంత్రణ రేఖ (LoC) వెంబడి మరోసారి కాల్పులకు పాల్పడింది. కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరీ, మెంధార్, నౌషేరా, సుందర్బానీ, అఖ్నూర్ ప్రాంతాల్లో పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఇండియన్ ఆర్మీ అప్రమత్తమై ఆ కాల్పులను తిప్పికొట్టింది.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ కు బ్యాక్ టు బ్యాక్ షాకిచ్చింది భారత ప్రభుత్వం. ఇటీవలే పాకిస్థాన్ కు చెందిన అన్నిరకాల దిగుమతులపై పూర్తిగా నిషేధం విధించగా.. మరో దేశం మీదుగా వాటిని భారత్ లోకి పంపేందుకు పాక్ వక్రబుద్ధిని ప్రదర్శించింది. యూఏఈ, సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంక దేశాల నుంచి తమ దిగుమతుల్ని భారత్ లోకి పంపేందుకు వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందడంతో.. పాక్ ప్రయత్నాలను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు.

Next Story