Breaking News : అయోధ్య రామాలయంపై బాంబుదాడికి కుట్ర భగ్నం

by Muthe.Rajitha |

అయోధ్య రామాలయంపై తీవ్రవాద సంస్థలు బాంబుదాడికి ప్లాన్ వేశాయి.

Breaking News : అయోధ్య రామాలయంపై బాంబుదాడికి కుట్ర భగ్నం
X

దిశ, వెబ్ డెస్క్ : అయోధ్య రామాలయంపై తీవ్రవాద సంస్థలు బాంబుదాడికి ప్లాన్ వేశాయి. దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో అయోధ్య రామాలయం(Ayodhya Ramalayam) ఒకటి. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఈ టెంపుల్ ను దర్శిస్తారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన ప్రదేశంగా అయోధ్యను సదర్శించి, బాలరాముడిని కొలుస్తారు. అయితే ఇంతటి ప్రాచుర్యం గల రామాలయంపై బాంబు దాడి(Bomb Attack)కి కుట్ర జరిగింది. రామమందిరాన్ని పేల్చివేసేందుకు ఐఎస్ఐ(ISI) భారీ పథక రచన చేసింది. ఇందుకోసం ఫైజాబాద్ కు చెందిన వ వ్యాపారిని, మరో టెర్రరిస్టు రెహ్మాన్ ను నియమించుకుంది. వీరు ఇరువురు కలిసి అయోధ్య రామాలయం వద్ద పలుమార్లు రెక్కీ కూడా కూడా నిర్వహించారు. అనంతరం రెహ్మాన్ హరియాణలో హ్యాండ్ గ్రెనేడ్లు కొనుగోలు చేశాడు. రైల్లో ఫరియాబాద్ నుంచి ఫైజాబాద్ వస్తుండగా.. నిఘా వర్గాల పక్కా సమాచారంతో గుజరాత్ ఏటీఎఫ్, ఫరీదాబాద్ ఎస్టీఎఫ్ టీమ్స్ రెహ్మాన్ ను అదుపులోకి తీసుకున్నాయి. రహస్య ప్రదేశం విచారణ జరుగుతున్నట్టు సమాచారం.

Next Story