Plane crash: గుజరాత్ విమాన ప్రమాదం వెనక కుట్ర కోణం?

by Prasad Jukanti |   (  Updated:2025-06-12 11:30:17  IST  )

గుజరాత్ విమాన ప్రమాదం వెనక కుట్ర కోణం?

Plane crash: గుజరాత్ విమాన ప్రమాదం వెనక కుట్ర కోణం?
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్ అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం అందరిని ఉలిక్కిపడేలా చేసింది. టేకాప్ అయిన కొద్ది సేపటికే ఎయిర్ విమానం (Air India)ఉన్నట్టుండి కుప్పకూలడం అందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనేదానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై కుట్రకోణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గాల్లోకి ఎగిరిన నిమిషాల వ్యవధిలోనే ఇంతటి స్థాయిలో విధ్వంసం జరగడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలను విమానయానశాఖ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టెక్నిలక్ ఫెయిల్యూర్స్ ఏమై ఉంటాయనే విషయంలో ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో పైలట్లు ఏటీసీకి ‘మేడే కాల్’ చేసినట్లు పౌరవిమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. తిరిగి ఏటీసీ పైలట్లను సంప్రదించేందుకు ప్రయత్నించగా విమానం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఆ తర్వాత కొన్ని సెకన్లలోనే ఫ్లైట్ క్రాష్ అయింది. దీంతో ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది సస్పెన్స్ గా మారింది. దీంతో ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాలంటే విమానం బ్లాక్ బాక్స్ కీలకంగా మారనుంది.

భయానకంగా గగనయానం.. ఇప్పటి వరకు భారత్‌లో ఎన్ని విమానప్రమాదాలు జరిగాయంటే?

Next Story