- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.7,640 కోట్ల ట్యాక్స్ కడతా.. నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక నేరస్థుడు సుకేశ్ లేఖ
రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుకేశ్‌తో పాటు అతని భార్య లీనా మారియా పాల్ ఈడీ కేసులను ఎదుర్కుంటున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో:
ఆర్థిక నేరస్థుడు సుకేశ్ చంద్రశేఖర్ రూ.7,640 ట్యాక్స్ చెల్లిస్తానంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఆర్థిక నేరారోపణలతో పాటు, వందల మందిని కోట్లాది రూపాయల మేర మోసం చేసిన కేసుల్లో సుకేశ్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. కాగా, విదేశాల్లో ఉన్న తన వ్యాపారాల వల్ల 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.22,410 కోట్ల మేర అర్జించాను. ఈ ఆదాయానికి సంబంధించి భారత్‌లో చెల్లించాల్సిన రూ.7,640 కోట్ల ట్యాక్స్‌ను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని ఆ లేఖలో పేర్కొన్నాడు. నెవెడాలోని ఎల్ఎస్ హోల్డింగ్స్ ఇంటర్నేషనల్, బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్‌లో రిజిస్టర్ అయిన స్పీడ్ గేమింగ్ కార్పొరేషన్‌లను 2016 నుంచి నిర్వహిస్తున్నట్లు సుకేశ్ ఆ లేఖలో తెలిపాడు. ప్రస్తుతం ఇండియాలో కొనసాగుతున్న ఆదాయపు పన్ను రికవరీ ప్రొసీడింగ్‌లతో పాటు పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లను పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సుకేశ్ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ బ్యాంకింగ్ నిబంధనలకు లోబడే తాను ఈ మొత్తాన్ని చట్టబద్దంగా సంపాదించానని నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుకేశ్‌తో పాటు అతని భార్య లీనా మారియా పాల్ ఈడీ కేసులను ఎదుర్కుంటున్నారు.






