- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అంబేద్కర్‌ను కాంగ్రెస్ ద్వేషించింది

- భారతరత్న ఇచ్చేందుకు నిరాకరించింది
- కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబానికే పరిమితం
- నేషన్ ఫస్ట్ అనేది బీజేపీ నినాదం
- రాజ్యసభలో ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఎంతో ద్వేషించింది. ఆయన ఎన్నికల్లో గెలవకుండా కుట్ర చేసింది. చివరకు భారత రత్న కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. ఇదంతా నేను చెప్పేది కాదు. అవన్నీ రికార్డుల్లో నమోదైన విషయాలే అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విలువలను తుడిచిపెడుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ గురువారం రాజ్యసభలో వారికి సమాధానం ఇచ్చారు. అంబేద్కర్ బతికుండగా ద్వేషించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు జై భీమ్ అంటూ నినాదాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బాబా సాహెబ్ కూడా కాంగ్రెస్‌ను వ్యతిరేకించారని మోడీ గుర్తు చేశారు. పేద ప్రజల అభివృద్ది కోసం మా కార్యక్రమాలు ఉంటాయి. పదేళ్లుగా దేశంలో సుపరిపాలనను అందిస్తున్నాము. 'సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్' అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాము. అయితే కాంగ్రెస్‌కు సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ అనే భావన కాంగ్రెస్ పార్టీలో ఉండదు. అది వారి ఆలోచన పరిధిని దాటి ఉంటుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒక కుటుంబానికే అంకితమైంది. కానీ బీజేపీ దేశం కోసం పని చేస్తుంది. నేషన్ ఫస్ట్ అనేది మా విధానమని మోడీ చెప్పారు. కాంగ్రెస్ రాజకీయాల్లో బూటకపు అంశాలు, రాజవంశం, బుజ్జగింపులు మాత్రమే ఉంటాయి. వారికి 'సబ్‌కా వికాస్' అనే స్పూర్తి తెలియదని ఆరోపించారు. పార్లమెంట్ సభల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగం స్పూర్తిదాయకంగా ఉంది. ఆమె మాటలు ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయని మోడీ చెప్పారు. ఆ ప్రసంగం మనందరికీ ముందుకు సాగే మార్గాన్ని చూపిందని చెప్పారు.