- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jai Ram Ramesh: డ్యామేజ్ కంట్రోల్ కోసమే ఇదంతా.. మోడీపై జైరాం రమేశ్ విమర్శలు
జరోదా కో ఫౌండర్ నిఖిల్ కామత్ (Nikhil Kamath) నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోడీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చురకలు అంటించింది.

దిశ, నేషనల్ బ్యూరో: జరోదా కో ఫౌండర్ నిఖిల్ కామత్ (Nikhil Kamath) నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోడీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చురకలు అంటించింది. ఆ వ్యాఖ్యలను నష్ట నివారణ చర్యలని కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత జైరాం రమేశ్ (Jai Ram Ramesh) విమర్శించారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘ఎనిమిది నెలల క్రితం తాను దేవదూత అని మోడీ ప్రకటించుకున్నారు. అందుకే ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కోసం చర్యలు చేపట్టారు’ అంటూ గతంలో మోడీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. నిఖిల్ కామత్ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోడీ(PM Modi podcast Interview) పాల్గొన్నారు. అందులో భాగంగానే గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు తప్పులు చేసినట్లు అంగీకరించారు. తాను కష్టపడి పనిచేయడానికి వెనకాడనని అన్నారు. తన స్వార్థం కోసం పనిచేయనని చెప్పుకొచ్చారు. దురుద్దేశాలతో ఏ తప్పూ చేయనని.. ఇదే తన జీవిత మంత్రమని పేర్కొన్నారు.. పొరపాట్లు జరగటం సహజమని.. తానూ కొన్ని తప్పులు చేసి ఉండవచ్చన్నారు. ‘నేనేం భగవంతుడ్ని కాదు కదా.. మనిషినే.. పొరపాట్లు జరుగాతాయి’ అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలపైనే జైరాంరమేష్ విమర్శలు చేశారు.






