కాంగ్రెస్ మరో రాజకీయ వ్యూహం! ప్రియాంకతో ప్రశాంత్ కిషోర్ భేటీ

by Muthe.Rajitha |

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధ్యక్షడు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీతో కీలక భేటీ అయ్యారు.

కాంగ్రెస్ మరో రాజకీయ వ్యూహం! ప్రియాంకతో ప్రశాంత్ కిషోర్ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధ్యక్షడు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీతో కీలక భేటీ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ 2022 లో కాంగ్రెస్ తో విభేదాల అనంతరం మూడేళ్లకు ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ వరుస ఓటములు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పీకే జన్ సూరజ్ దారుణ విఫలం నేపథ్యంలో ఈ భేటీ ఎలాంటి పొలిటికల్ టర్న్ తీసుకుంటుందో అని ఉత్కంఠత మొదలైంది.

అయితే గతంలో కాంగ్రెస్ ను విమర్శించిన ప్రశాంత్ కిషోర్ మరోసారి పునరాలోచనలో పడ్డట్టు కనిపిస్తోంది. కాగా నిన్న జరిగిన వోట్ చోరీ ధర్నా కార్యక్రమంలోమోడీని గద్దె దించుతామని రాహుల్ గాంధీ ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మరో కొత్త రాజకీయ వ్యూహానికి తెర తీసినట్టు తెలుస్తోంది.

Next Story